Bajaj Housing Finance Q2 Results: రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్.. 21 శాతం పెరిగిన లాభాలు

భారతదేశం(India)లోని దిగ్గజ కంపెనీలు గత కొన్ని రోజులుగా జులై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల(July-September Quarter Results)ను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-10-21 15:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం(India)లోని దిగ్గజ కంపెనీలు గత కొన్ని రోజులుగా జులై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల(July-September Quarter Results)ను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా భారతదేశంలోనే టాప్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(NBFC)ల్లో ఒకటైన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్(Bajaj Housing Finance) సోమవారం త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25) రెండో త్రైమాసికం(Q2FY25)లో సంస్థ లాభం 21 శాతం పెరిగి రూ. 546 కోట్ల లాభాన్ని(Net profit) నమోదు చేసినట్లు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ తెలిపింది. కాగా గతేడాది ఇదే త్రైమాసిక ఫలితాల నాటికి నికర లాభం రూ. 451 కోట్లుగా ఉందని వెల్లడించింది. అలాగే ఈ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 13 శాతం పెరిగి రూ.713 కోట్లకు చేరుకుందని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. కాగా ఐపీవోలో IPO లిస్టింగ్ అయినా తర్వాత త్రైమాసిక ఆదాయాలు నమోదు చేయడం ఇదే మొదటి సారి. సెప్టెంబర్ 2024లో IPO ద్వారా ఆ సంస్థ రూ. 6,560 కోట్లను సమీకరించింది. మరోవైపు మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను సుమారు ₹1.4 లక్షల కోట్లకు పెంచుకుంది. కాగా త్రైమాసిక ఫలితాల ప్రకటనకు ముందు సోమవారం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(NSE)లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేరు ధర 1.82 శాతం మేర తగ్గి ₹136.8 వద్ద ముగిసింది.    


Similar News