SMPP LTD IPO: త్వరలోనే ఎస్ఎంపీపీ లిమిటెడ్ ఐపీఓ.. పూర్తి వివరాలివే..!

బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, కమ్యూనికేషన్ పరికరాలు వంటి పర్సనల్ ప్రొటెక్షన్ ప్రొడక్ట్స్ ను తయారు చేస్తున్న ఎస్ఎంపీపీ లిమిటెడ్(SMPP LTD) కంపెనీ త్వరలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(IPO) ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ కానుంది.

Update: 2024-10-21 16:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, కమ్యూనికేషన్ పరికరాలు వంటి పర్సనల్ ప్రొటెక్షన్ ప్రొడక్ట్స్ ను తయారు చేస్తున్న ఎస్ఎంపీపీ లిమిటెడ్(SMPP LTD) కంపెనీ త్వరలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(IPO) ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ కానుంది. ఐపీఓ ద్వారా సుమారు రూ. 4000 కోట్లను సమీకరించుకోవాలని ఆ సంస్థ భావిస్తోంది. ఈ మేరకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) దగ్గర డీఆర్​హెచ్​పీ(DRHP) పేపర్స్​ని ఫైల్​ చేసింది. ఈ ఆఫర్లో భాగంగా రూ. 580 కోట్లను విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనున్నారు. అలాగే రూ. 3420 కోట్ల విలువ చేసే షేర్లను పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయానికి ఉంచనున్నారు. డీఆర్​హెచ్​పీ దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎస్ఎంపీపీ లిమిటెడ్ షేర్లు బీఎస్ఈ(BSE), ఎన్ఎస్ఈ(NSE) లో లిస్ట్ అవుతాయి. అయితే ఐపీఓ సబ్ స్క్రిప్షన్ డేట్, లాట్ సైజ్, షేర్ల ధర వంటి పూర్తి వివరాలను కంపెనీ ఇంకా అధికారంగా ప్రకటించలేదు. కాగా ఐపీఓ ద్వారా సమీకరించే నిధులను భవనాలు నిర్మించడం, ల్యాండ్ డెవలప్మెంట్, మందుగుండు సామగ్రి తయారీ ప్లాంట్ కోసం ఉపయోగిస్తామని కంపెనీ తెలిపింది.  


Similar News