GST: వెనీలా ఫ్లేవర్ ఐస్‌క్రీమ్ మిక్స్‌పై 18 శాతం జీఎస్టీ

సాఫ్ట్ ఐస్‌క్రీం మిక్స్ పాల ఉత్పత్తి కాదని, అది 18 శాతం జీఎస్టీ పరిధిలోకి వస్తుందని ఏఏఆర్‌ స్పష్టం చేసింది.

Update: 2024-10-21 15:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: వెనీలా ఐస్‌క్రీమ్ ఇష్టపడే వారికి బ్యాడ్‌న్యూస్. వెనీలా ఫ్లేవర్‌లో ఉండే సాఫ్ట్ ఐస్‌క్రీం మిక్స్ పాల ఉత్పత్తి కాదని, అది 18 శాతం జీఎస్టీ పరిధిలోకి వస్తుందని అథారిటీ ఫర్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌ (ఏఏఆర్‌) రాజస్థాన్ బెంచ్ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి వీఆర్‌బీ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ వెనీల మిక్స్‌పై పన్ను విధించడం గురించి ఏఏఆర్‌ను సంప్రదించింది. ఇందులో 61.2 శాతం చక్కెర, 34 శాతం స్కిమ్‌డ్ మిల్క్ పౌడర్, ఫ్లేవర్, ఉప్పు సహా 4.8 శాతం ఇతర పదార్థాలు ఉన్న వెనీల మిక్స్ గురించి వివరించింది. సాఫ్ట్ సర్వ్ స్మూత్, క్రీమీ రూపంలో ఉండేలా చేసేందుకు ప్రతి ముడి పదార్థానికి నిర్దిష్ట పాత్ర ఉందని ఏఏఆర్ గుర్తించింది. పదార్థాలు మాత్రమే కాకుండా, 'సాఫ్ట్ సర్వ్' అంటే ఐస్ క్రీం తయారీ యంత్రంలో చేసిన ప్రాసెసింగ్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. జీఎస్టీ చట్టం ప్రకారం, ప్రాసెసింగ్ ద్వారా వినియోగం కోసం తయారు చేసిన ఆహారం 18 శాతం పన్ను పరిధిలోకి వస్తుంది. ఇది కాకుండా, పాలపొడి, చక్కెర, ఏదైనా ఇతర అదనపు పదార్థాలు జెల్లీ, ఐస్ క్రీం తయారీలపై కూడా 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. 

Tags:    

Similar News