Ola S1 Pro Sona: కస్టమర్లకు ఓలా బంపర్ ఆఫర్.. సెల్ఫీతో కొత్త స్కూటర్ గెలుచుకునే ఛాన్స్..!
దేశీయ దిగ్గజ టూ వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్(EV) తయారీ సంస్థ ఓలా(Ola) ఇటీవల పలు వివాదాలతో విమర్శలు పాలవుతున్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టూ వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్(EV) తయారీ సంస్థ ఓలా(Ola) ఇటీవల పలు వివాదాలతో విమర్శలు పాలవుతున్న విషయం తెలిసిందే. స్కూటర్ల బ్యాటరీలు(Battery) పేలి పోవడం, ఆకస్మిక షట్ డౌన్(sudden Shutdown) అవ్వడం వంటి ప్రాబ్లమ్స్ కారణంగా కస్టమర్లు ఓలా సర్వీస్ సెంటర్ల ముందు ఆందోళన చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఓలా ఈవీ స్కూటర్ల సేల్స్ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ క్రమంలో విక్రయాలను పెంచుకునేందుకు సంస్థ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా డిసెంబర్ 25 నాటికి దేశవ్యాప్తంగా సర్వీస్ సెంటర్ల(Service Centers) సంఖ్యను 4000కు పెంచనున్నట్లు ఇటీవలే వెల్లడించింది.
ఇదిలా ఉంటే.. కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఓలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో గోల్డ్ డిజైన్(Gold Design)తో కొత్త ఈవీ స్కూటర్ ను లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. ఎస్1 ప్రో సోనా(S1 Pro Sona) పేరుతో దీన్ని దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. పర్ల్ వైట్, గోల్డ్ రంగుల్లో ఇది లభిస్తుందని, ప్రారంభ ఆఫర్ లో భాగంగా ఎంపిక చేసిన కస్టమర్లకు ఎస్1 ప్రో సోనా లిమిటెడ్ ఎడిషన్‌ను ఫ్రీగా గెలుచుకునే అవకాశాన్ని ఇస్తున్నామని ఓలా పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ లో అధికారికంగా ప్రకటించింది ఈ కాంటెస్ట్ లో పాల్గొనేవారు ఓలా ఎస్1తో రీల్ పోస్ట్(Reel Post) చేయాలి లేదా బ్రాండ్ స్టోర్(Brand Store) వెలుపల ఒక ఫోటో(Photo)/సెల్ఫీ(Selfee)ని తీసుకొని #OlaSonaContest అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఓలా ఎలక్ట్రిక్‌ను ట్యాగ్ చేయాలి. డిసెంబర్ 25న ఓలా స్టోర్లలో జరిగే పోటీలో విజేతను ప్రకటిస్తారు.