Jeff Bezos: డిసెంబర్ 28న రెండో వివాహం చేసుకోబోతున్న జెఫ్ బెజోస్.. పెళ్ళికి రూ. 5,000 కోట్ల ఖర్చు..!

ప్రపంచ కుబేరుడు, అమెజాన్ ఫౌండర్(Amazon Founder) జెఫ్ బెజోస్(Jeff Bezos) మరోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు.

Update: 2024-12-22 11:02 GMT
Jeff Bezos: డిసెంబర్ 28న రెండో వివాహం చేసుకోబోతున్న జెఫ్ బెజోస్.. పెళ్ళికి రూ. 5,000 కోట్ల ఖర్చు..!
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: ప్రపంచ కుబేరుడు, అమెజాన్ ఫౌండర్(Amazon Founder) జెఫ్ బెజోస్(Jeff Bezos) మరోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. తన ప్రేయసి లారెన్ శాంచెజ్(Lauren Sanchez)ను డిసెంబర్ 28న వివాహం చేసుకోనున్నట్లు ఇంటర్నేషనల్ మీడియా కథనాలు వెల్లడించాయి. కొలరాడో(Colorado)లోని ఆస్పెన్‌(Aspen)లో కొద్దిమంది సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో వింటర్ వండర్‌ల్యాండ్ వెడ్డింగ్‌ పద్దతిలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. కాగా ఈ పెళ్ళికి జెఫ్ బెజోస్ ఏకంగా రూ. 5,000 కోట్లను ఖర్చు చేయనున్నట్లు సమాచారం. గతేడాది మేలోనే ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నట్టు, 21 కోట్ల డైమండ్ రింగ్(Diamond Ring)ను బెజోస్ కానుకగా ఇచ్చినట్లు కథనాలను వెలువడ్డాయి. కాగా.. వీళ్లిద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం. జెఫ్ బెజోస్ తన మొదటి భార్య మెకంజీ స్కాట్(Mackenzie Scott)కు 2019లో విడాకులు ఇచ్చారు. మెకంజీతో ఆయనకు నలుగురు సంతానం ఉన్నారు. మరోవైపు లారెన్ శాంచెజ్ కు గతంలో పాట్రిక్ వైట్ సెల్(Patrick Whitecell) అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.   

Tags:    

Similar News