WhatsApp: వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. ఇకపై అలా కుదరదు!

వాట్సాప్ (WhatsApp) యూజర్ల ప్రైవసీని మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకొస్తుంది.

Update: 2025-04-25 10:47 GMT
WhatsApp: వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. ఇకపై అలా కుదరదు!
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: స్మార్ట్‌ఫోన్ (Smart Phone) వినియోగించే ప్రతి ఒక్కరూ దాదాపు వాట్సాప్ ఉపయోగిస్తుంటారు. వాట్సాప్ (WhatsApp) కూడా యూజర్ల ప్రైవసీని మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ఫీచర్లు అందిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో అద్భుతమైన ప్రైవసీ ఫీచర్‌ను (New Privacy Feature) తీసుకొచ్చింది. ఇది ఆన్ చేసుకుంటే.. మనం సెండ్ చేసిన మీడియాను అవతలి వ్యక్తులు సేవ్ చేసుకోవడానికి, ఎక్స్‌పోస్టు చేసుకోవడానికి వీలుండదు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.

వాట్సాప్.. యూజర్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని వ్యక్తిగత, గ్రూప్‌ చాట్స్‌లో మరింత ప్రైవసీని జోడిస్తూ ప్రైవసీ సెట్టింగ్స్‌లో 'అడ్వాన్స్‌డ్‌ చాట్‌ ప్రైవసీ' (Advanced Chat Privacy) ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఇది ఆన్ చేస్తే.. మీరు పంపించే మీడియా అవతలి వారు డౌన్‌లోడ్‌ చేసుకోలేరు. ఆటోమేటిక్‌గా కూడా డౌన్‌లోడ్‌ అవ్వదు. ఎక్స్‌పోర్ట్‌ చేద్దామని ప్రయత్నించినా 'కెనాట్‌ ఎక్స్‌పోర్ట్‌ చాట్‌' అనే సందేశం కనిపిస్తుంది. అంటే.. మీరు పంపించే మీడియా.. మీ వాట్సప్‌ను దాటి వేరే వాటిల్లో పంచుకోవడం కుదరదు. ఏదైనా సున్నితమైన అంశంపై గ్రూపుల్లో చర్చిస్తున్నప్పుడు ఈ ఆప్షన్ ఉపయోగకరంగా ఉంటుంది. వాట్సాప్‌ అప్‌డేటెడ్‌గా ఉంటే ఇప్పటికే ఈ ఫీచర్‌ పలువురికి అందుబాటులోకి వచ్చి ఉంటుంది. 

Tags:    

Similar News