Silver Price: రూ. లక్ష మార్కు దాటిన వెండి

శుక్రవారం ఒక్కరోజే వెండి దాదాపు రూ. 5,000 పెరిగింది.

Update: 2024-10-21 13:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: గత కొద్దిరోజులుగా విలువైన లోహాలు బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవలే బంగారం 10 గ్రాములు కీలక రూ. 80 వేలు దాటిన సంగతి తెలిసిందే. పసిడి బాటలోనే వెండి సైతం గరిష్ఠ స్థాయిలకు చేరుకుంటోంది. తాజాగా సోమవారం రిటైల్ మార్కెట్లో జీఎస్టీ కలుపుకుని వెండి కిలో రూ. లక్ష దాటింది. శుక్రవారం ఒక్కరోజే వెండి దాదాపు రూ. 5,000 పెరిగింది. మరికొద్ది రోజుల్లో ఇది రూ. 1.25 లక్షలకు చేరుకోవచ్చు. దేశీయంగా వ్యాపారుల నుంచి పెరుగుతున్న డిమాండ్ కారణంగా బంగారం బాటలోనే వెండి ఖరీదవుతోంది. అలాగే, పెరుగుతున్న బంగారం ధరలు కూడా వెండిపై ప్రభావం చూపుతున్నాయని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్(ఐబీజేఏ) అధ్యక్షుడు పృథ్వీరాజ్ కొఠారి అన్నారు. వీటితో పాటు ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) తయారీలోనూ వెండి వినియోగం పెరగడంతో ధరలు కొత్త గరిష్ఠాలకు చేరడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ డిమాండ్‌కు కలిగి ఉందని నిపుణులు భావిస్తున్నారు. కాగా, సోమవారం బంగారం ధరలు సైతం పెరిగాయి. స్వచ్ఛమైన 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ. 79,640కి చేరింది. పన్నులు కలుపుకుని రిటైల్ మార్కెట్లో ఇది రూ. 80 వేలకు పైనే ఉంటుంది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి రూ. 73 వేల వద్ద ఉంది. 

Tags:    

Similar News