IT Jobs: సెప్టెంబర్ త్రైమాసికంలో పెరిగిన ఐటీ ఉద్యోగాలు

దేశంలోని ఐటీ రంగాని(IT sector)కి చెందిన ప్రముఖ కంపెనీలు గత కొన్ని నెలలుగా ఉద్యోగుల సంఖ్యను క్రమంగా పెంచుకుంటున్నాయి.

Update: 2024-10-21 12:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని ఐటీ రంగాని(IT sector)కి చెందిన ప్రముఖ కంపెనీలు గత కొన్ని నెలలుగా ఉద్యోగుల సంఖ్యను క్రమంగా పెంచుకుంటున్నాయి. కొత్త టెక్నాలజీలు(New Technologies) అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో దిగ్గజ కంపెనీలు నైపుణ్యాలు(Skills) కలిగిన వారిని నియమించుకుంటున్నాయి. దీంతో ఐటీ పరిశ్రమలో సన్నగిల్లిన నియామకాలు మళ్లీ ఉపందుకున్నాయనే చెప్పాలి. దాదాపు ఏడు త్రైమాసికాల(Seven Quarters) తర్వాత భారతీయ ఐటీ పరిశ్రమలో ఉద్యోగుల సంఖ్య పెరగడం విశేషం.

ఇదిలాఉంటే.. ఇప్పటివరకు త్రైమాసిక ఫలితాల(Quarterly Results)ను ప్రకటించిన దేశంలోని టాప్ సిక్స్ ఐటీ కంపెనీలలోని ఐదు కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య పెరిగింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్(Infosys), విప్రో(Wipro), టెక్ మహీంద్రా(Tech Mahindra), ఎల్‌టీఐమైండ్‌ట్రీ(LTIMindTree) సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరం(2024-2025) సెప్టెంబర్(September)తో ముగిసిన రెండో త్రైమాసికం(Q2FY25)లో దాదాపు 17,500 మందికి పైగా సిబ్బందిని నియమించుకున్నాయి. ఒక్క హెచ్‌సీఎల్‌ టెక్‌లో మాత్రమే 780 మంది ఉద్యోగులు తగ్గారు. అమెరికా కంపెనీతో విడిపోవడం వల్లే ఆ సంస్థలో ఉద్యోగులు తగ్గారు. కాగా ఇండియాలోనే ఐదో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టెక్ మహీంద్రా రెండో త్రైమాసికంలో మొత్తం 6,653 మందిని నియమించుకొని మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత టాటా గ్రూప్ కు చెందిన టీసీఎస్‌ 5,726 మందితో రెండో ప్లేస్ లో నిలిచింది. ఇక ఎల్‌టీఐమైండ్‌ట్రీ 2504, ఇన్ఫోసిస్ 2456, విప్రో 978 మందితో మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచాయి.     


Similar News