Ultratech Cement Q2 Results: రెండో త్రైమాసికంలో భారీగా తగ్గిన అల్ట్రాటెక్ సిమెంట్ లాభాలు

భారతదేశంలోనే అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్(Ultratech Cement) ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2024-25) రెండో త్రైమాసిక(Q2FY25) ఫలితాలను సోమవారం ప్రకటించింది.

Update: 2024-10-21 11:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలోనే అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్(Ultratech Cement) ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2024-25) రెండో త్రైమాసిక(Q2FY25) ఫలితాలను సోమవారం ప్రకటించింది. ఈ సెప్టెంబర్(September)తో ముగిసిన త్రైమాసికం(Quarter)లో సంస్థ నికర లాభాలు(Net profit) రూ. 820 కోట్లకు పరిమితమైందని తెలిపింది. గతేడాది ఇదే సమయంలో నికర లాభం రూ.1,281.45 కోట్లుగా ఉందని తన రెగ్యులేటరీ ఫైలింగ్(Regulatory Filing)లో పేర్కొంది. ఇక కంపెనీ మొత్తం ఆదాయం 2.35 శాతం తగ్గి రూ. 16,012.13 కోట్ల నుంచి రూ. 15,634.73 కోట్లకు పడిపోయింది. ఇక ఆర్ధిక ఫలితాల వెల్లడి సందర్భంగా సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ల(Stock Markets)లో అల్ట్రాటెక్ సిమెంట్ షేరు(Ultratech Cement Share) ధర 1.69 శాతం తగ్గి రూ.10,873.75 వద్ద ముగిసింది. కాగా 2020 జూన్‌తో ముగిసిన త్రైమాసికం తర్వాత కంపెనీకి లాభాలు తగ్గడం ఇదే మొదటి సారి. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో నికర లాభం 52 శాతానికి, ఆదాయం 13 శాతానికి పడిపోయింది.


Similar News