ఇంద్రావతి నదిలో పడవల బోల్తా

దిశ ప్రతినిధి, కరీంనగర్: మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో పడవ ప్రమాదం జరిగింది. ఇంద్రావతి నదిలో మంగళవారం రాత్రి రెండు నాటు పడవలు బోల్తాపడడంతో ముగ్గురు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకా సోమన్‌పల్లికి చెందిన కొంతమంది.. పొరుగున ఉన్న చత్తీస్‎ఘడ్ రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రామనికి హజరై తిరిగి వస్తున్నారు. మంగళవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో నాటు పడవలో తిరుగు ప్రయాణం కాగా పడవలు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో […]

Update: 2020-10-20 22:57 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో పడవ ప్రమాదం జరిగింది. ఇంద్రావతి నదిలో మంగళవారం రాత్రి రెండు నాటు పడవలు బోల్తాపడడంతో ముగ్గురు గల్లంతయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకా సోమన్‌పల్లికి చెందిన కొంతమంది.. పొరుగున ఉన్న చత్తీస్‎ఘడ్ రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రామనికి హజరై తిరిగి వస్తున్నారు. మంగళవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో నాటు పడవలో తిరుగు ప్రయాణం కాగా పడవలు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు గల్లంతవ్వగా.. మరో 13 మందిని స్థానికులు, అధికారులు రక్షించారు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అత్యంత ప్రమాదకరంగా ఉండే ఇంద్రావతి నది మీదుగా నాటు పడవల్లో రాత్రి వేళల్లో ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

Tags:    

Similar News