పర్వేశ్‌పై మరో 24 గంటల నిషేధం

          ఢిల్లీలో ఎన్నికల ప్రచారం చేయకుండా బీజేపీ ఎంపీ పర్వేశ్‌వర్మపై ఎన్నికల కమిషన్ మళ్లీ నిషేధం విధించింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఉగ్రవాది అన్నందుకు 24 గంటలపాటు ప్రచారం చేయకూడదని ఆదేశించింది. వారం రోజుల క్రితం కూడా పర్వేశ‌వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో 96 గంటలు ప్రచారం చేయకుండా ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. అది పూర్తి కాగానే మళ్లీ 24 గంటలపాటు నిషేధం విధించడం గమనార్హం.       […]

Update: 2020-02-05 08:30 GMT

ఢిల్లీలో ఎన్నికల ప్రచారం చేయకుండా బీజేపీ ఎంపీ పర్వేశ్‌వర్మపై ఎన్నికల కమిషన్ మళ్లీ నిషేధం విధించింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఉగ్రవాది అన్నందుకు 24 గంటలపాటు ప్రచారం చేయకూడదని ఆదేశించింది. వారం రోజుల క్రితం కూడా పర్వేశ‌వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో 96 గంటలు ప్రచారం చేయకుండా ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. అది పూర్తి కాగానే మళ్లీ 24 గంటలపాటు నిషేధం విధించడం గమనార్హం.

‘ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ పట్ల బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ వ్యాఖ్యలు తీవ్ర విద్వేషంతో కూడినవి. ఈ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి పూర్తి విరుద్ధం. ఢిల్లీలో పర్వేశ్‌వర్మ ఎన్నికల ప్రచారంపై మరో 24 గంటలు నిషేధం విధించాం’ అని ఎన్నికల సంఘం తెలిపింది. పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహిన్‌బాగ్‌లో ఆందోళనలు జరుగుతున్న విషయం విధితమే. వీటిని ఉద్దేశించి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ పర్వేశ్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. షాహిన్‌బాగ్ ఆందోళనకారులు మీ ఇండ్లలోకి చొరబడి అక్కాచెల్లెలు, కూతుర్లపై అత్యాచారాలకు పాల్పడుతారని ఆరోపించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ఎన్నికల కమిషన్ ఎంపీ పర్వేశ్ వర్మ ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా తొలిసారి నిషేధం విధించింది.

Tags:    

Similar News