‘దాని వెనుక పెద్దల హస్తం ఉంది.. వివరాలన్నీ సీఐడీకి చెబుతా’

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధాని భూమిపుత్ర అక్రమాల్లో డొంక కదులుతోంది. తాజాగా.. భూమిపుత్ర గత ఉద్యోగి ప్రసాద్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. దళితుల భూములు కొట్టేయడం, రాజధానిలో 20 కి పైగా గ్రామాల్లో అసైన్డ్ భూమి కొనుగోళ్లు, భూమిపుత్ర స్టాఫ్ పేరు మీదనే అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు చేయడంతో ప్రసాద్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రసాద్ స్పందిస్తూ.. నాటి అగ్రిమెంట్లు, కొనుగోళ్ల వెనుక పెద్దల హస్తం ఉందని అన్నారు. తమ సొంత భూములు […]

Update: 2021-07-06 04:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధాని భూమిపుత్ర అక్రమాల్లో డొంక కదులుతోంది. తాజాగా.. భూమిపుత్ర గత ఉద్యోగి ప్రసాద్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. దళితుల భూములు కొట్టేయడం, రాజధానిలో 20 కి పైగా గ్రామాల్లో అసైన్డ్ భూమి కొనుగోళ్లు, భూమిపుత్ర స్టాఫ్ పేరు మీదనే అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు చేయడంతో ప్రసాద్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రసాద్ స్పందిస్తూ.. నాటి అగ్రిమెంట్లు, కొనుగోళ్ల వెనుక పెద్దల హస్తం ఉందని అన్నారు. తమ సొంత భూములు కూడా బ్రహ్మానందరెడ్డి రాయించుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. రోజుకు పదుల సంఖ్యలో అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు జరిగేవని వెల్లడించారు. నా పేరున ఎంత భూమి ఉందో తనకే తెలీదని అన్నారు. అసైన్డ్ భూములను ప్యాకేజ్ జీవో వస్తుందని బ్రహ్మానందరెడ్డికి ముందే తెలుసని తెలిపారు. నాడు జరిగిన అక్రమాల అన్ని వివరాలు సీఐడీకి చెబుతానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News