Breaking: ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ...
దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ(Prime Minister Modi)తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు. కొత్త సంవత్సరంలో కావాల్సిన నిధులపైనా మోడీకి చంద్రబాబు వివరిస్తున్నారు. అంతేకాదు రాష్ట్ర రాజకీయాలపైనా చర్చిస్తున్నారు. మోడీతో భేటీ అనంతరం పలువురు కేంద్రమంత్రులను కూడా సీఎం చంద్రబాబు కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించనున్నారు. కేంద్రహోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah)ను చంద్రబాబు ప్రత్యేకంగా కలవనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రం నుంచి పలు డిమాండ్లను అమిత్ షా దృష్టికి తీసుకెల్లానున్నారు. అలాగే గత బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయించిన అంశాలను ప్రస్తావించనున్నారు.
ఇప్పటికే కేంద్రమంత్రి కుమారస్వామి(Union Minister Kumaraswamy)ని చంద్రబాబు కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant) పునరుజ్జీవ ప్రణాళికపై చర్చించారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(BJP National President JP Nadda) ఇంట్లో జరిగిన ఎన్డీయే రాష్ట్రాల సీఎంలు, ముఖ్యనేతల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు.