AP Govt.: నెలాఖరున నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీ విరమణ.. ఏపీ కొత్త సీఎస్ ఆయనేనా?

ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ డిసెంబర్ 31న పదవీ విరమణ చేయబోతున్నారు.

Update: 2024-12-25 17:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ డిసెంబర్ 31న పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా ఎవరిని నియమిస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, ఇప్పటికే నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని ఆరు నెలల పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించిన నేపథ్యంలో ఆయనకు మరోసారి అవకాశం లేదు. అదేవిధంగా సీఎం చంద్రబాబుకు కూడా పొడిగింపు ఆలోచన చేయపోవడంతో కొత్త సీఎస్ బాధ్యతలు లాంఛనంగా కనిపిస్తోంది. కాగా, చీఫ్ సెక్రటరీ పదవి కోసం మొత్తం ఎనమిది మంది సీనియర్ ఐఏఎస్‌లు పోటీ పడుతోన్నట్లుగా తెలుస్తోంది. అందులో ఆర్పీ సిసోడియా, అనంత రాము, శ్రీలక్ష్మి, అజయ్ జైన్, సాయిప్రసాద్, సుమితా దావ్రా, విజయానంద్, రాజశేఖర్‌ ఉన్నారు. వీరిలో ప్రముఖంగా 1992 బ్యాచ్‌కు చెందిన విజయానంద్, 1991 బ్యాచ్‌కు చెందిన ఆర్పీ సిసోడియా, సాయి ప్రసాద్ పేర్లు చంద్రబాబు పరిశీలనలో ఉన్నట్లుగా సమాచారం.  

Tags:    

Similar News