Tirupati: 10 అడుగుల కొండ చిలువ హల్ చల్.. భక్తుల అరుపులు, కేకలతో గందరగోళం

తిరుపతి అలిపిరి నడకమార్గంలో భారీ కొండచిలువ హల్ చల్ చేసింది...

Update: 2024-12-25 11:18 GMT
Tirupati: 10 అడుగుల కొండ చిలువ హల్ చల్.. భక్తుల అరుపులు, కేకలతో గందరగోళం
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: తిరుమల భక్తుల(Tirumala Devotees)ను అడవి జంతువులు(wild animals), పాములు(Snakes) కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. శేషాచలం అడవి (Seshachalam Forest) నుంచి అలిపిమార్గం(Alipiri Exit)లోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. తరచూ ఇలాంటి ఘటనలను చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా జరిగిన ఘటనతో భక్తులు హడల్ పోయారు. గజగజ వణికిపోయారు.

తెలుగు రాష్ట్రాల నుంచే కాదు. దేశ విదేశాల నుంచి ప్రతినిత్యం తిరుమల పుణ్యక్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తుంటారు. వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని తిరిగి వెళ్తుంటారు. అయితే భక్తులు ముందుగా తిరుపతికి చేరుకుంటారు. అక్కడి నుంచి బస్సు లేదా నడకమార్గంలో తిరుమలకు చేరుకుంటారు. శేషాచలం అడవిలోని మెట్లమార్గం గుండా భక్తులు కొండపైకి చేరుకుని స్వామివారిని దర్శించుకునే భక్తులు వేలల్లో ఉంటారు.

అయితే కొన్ని సమయాల్లో ఈ మార్గమధ్యలో అడవి జంతువులు, పాములు హల్ చల్ చేస్తు్న్నాయి. దీంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి ఘటన తాజాగా కూడా జరిగింది. అలిపిరి నడకమార్గంలో భారీ కొండచిలువ హల్ చల్ చేసింది. 10 అడుగుల కొండ చిలువ నడకమార్గంల కనిపించింది. దీంతో భక్తులు ఆందోళన చెందారు. వెంటనే విజిలెన్స్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ ఉద్యోగి భాస్కర్ భారీ కొండ చిలువను పట్టుకుని అవ్వాచారికోనలో వదిలేశారు. దీంతో నడకమార్గం భక్తులు ఊపిరిపీల్చుకున్నారు.

Tags:    

Similar News