Tirumala News:తిరుమల శ్రీవారికి భక్తుడి భారీ విరాళం.. ఎంతంటే?
తిరుమల (Tirumala) వేంకటేశ్వరస్వామికి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశారు.
దిశ,వెబ్‌డెస్క్: తిరుమల (Tirumala) వేంకటేశ్వరస్వామికి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries ) సీఈవో పి.ఎం.ఎస్.ప్రసాద్ బుధవారం టీటీడీ (TTD) ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.1,11,11,111 (కోటి పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు రూపాయలు) విరాళంగా అందించారు. ఈ మేరకు విరాళం డీడీని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.
ఇటీవల తిరుపతికి చెందిన వ్యాపారి ఒకరు స్వామివారికి కోటి రూపాయలు అందజేసిన విషయం తెలిసిందే. జనవరి 7న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం(Alwar Tirumanjanam) నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది(Ugadi) , ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం (Brahmotsavam) , వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.