‘అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలి’.. మరోసారి అల్లు అర్జున్ జాతకం పై వేణు స్వామి సెన్సేషనల్ కామెంట్స్!
ప్రముఖ జ్యోతిష్యుడు(famous astrologer) వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ సంచలనం సృష్టిస్తారు.
దిశ,వెబ్‌డెస్క్: ప్రముఖ జ్యోతిష్యుడు(famous astrologer) వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ సంచలనం సృష్టిస్తారు. ఈ క్రమంలో ఇటీవల వేణు స్వామి(Venu Swami) వార్తల్లో నిలుస్తున్నారు. అయితే నేడు(బుధవారం) ‘పుష్ప-2’ ప్రీమియర్ షో తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి వేణుస్వామి ఆర్థిక సాయం చేశారు. రేవతి భర్త భాస్కర్‌కు రూ.2 లక్షల చెక్కును ఆయన అందజేశారు. అలాగే శ్రీతేజ్ పేరిట మృత్యుంజయ హోమం కూడా చేస్తానని ఆయన ప్రకటించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐకాన్ స్టార్(Icon Star) అల్లు అర్జున్(Allu Arjun) జాతకం చెప్పారు. శని ఉండటం వల్లే అల్లు అర్జున్‌కు ఈ సంఘటన జరిగిందని వేణు స్వామి అన్నారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది మార్చి 29 వరకు అల్లు అర్జున్ జాతకం బాగాలేదు. కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత ఆయనకు అంతా మంచే జరుగుతుంది. ఎవరు కావాలని ఏది చేయరు.. ప్రతి ఒక్కరి లైఫ్‌లో తప్పు ఒప్పులు జరుగుతుంటాయి. తొక్కిసలాట ఓ అనుకోని ఘటన అని వేణు స్వామి పేర్కొన్నారు. జాతకాలు బాగుండడానికి ఇలాంటి ఘటనలకు సంబంధం లేదు అన్నారు. ప్రస్తుతం వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.