సైబర్ నేరస్తుల పట్ల అప్రమత్తత అవసరం
దిశ, వరంగల్: సైబర్ నేరగాళ్ళతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీన్ కమిషనర్ రవీందర్ సూచించారు. సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఆయన శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రజలు తమ కనీస అవసరాలకు సైతం ఇంటర్‌నెట్‌ను వినియోగిస్తూ ఆన్‌లైన్ ద్వారా వస్తువులు కొనుగోలు చేస్తున్నారని, ఇదే అదునుగా సైబర్ నేరగాళ్ళు మోసాలకు పాల్పడున్న విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యంగా లాటరీ, బహుమతులు వచ్చాయని, ఉద్యోగాలు, రుణాలు, సెల్ టవర్లు ఇప్పిస్తామని […]
దిశ, వరంగల్: సైబర్ నేరగాళ్ళతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీన్ కమిషనర్ రవీందర్ సూచించారు. సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఆయన శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ప్రజలు తమ కనీస అవసరాలకు సైతం ఇంటర్‌నెట్‌ను వినియోగిస్తూ ఆన్‌లైన్ ద్వారా వస్తువులు కొనుగోలు చేస్తున్నారని, ఇదే అదునుగా సైబర్ నేరగాళ్ళు మోసాలకు పాల్పడున్న విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యంగా లాటరీ, బహుమతులు వచ్చాయని, ఉద్యోగాలు, రుణాలు, సెల్ టవర్లు ఇప్పిస్తామని సెల్‌ఫోన్లకు వచ్చే సంక్షిప్త సమాచారాన్ని నమ్మి సైబర్ నేరగాళ్ళ ఉచ్చుకు చిక్కిమోసపోతున్నట్లు పేర్కొన్నారు. అపరిచిత వ్యక్తుల నుంచి తమ ఫోన్లకు వచ్చే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం, లింక్‌లపై క్లిక్ చేయడం లాంటి వాటికి ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి తమ ఫోన్లకు వచ్చే ఒన్ టైం పాస్ వర్డ్‌ను ఇతరులకు తెలియజేయకపోవడం ద్వారా ప్రజలు తమ డబ్బును నష్టపోకుండా జాగ్రత్త పడవచ్చని పోలీస్ కమిషనర్ సూచించారు..
Tags: cyber crime, warangal cp ravinder, alert on cyber Fraud, Beware of people losing their money