టెంపుల్ మోడల్‌లో అయోధ్య రైల్వే స్టేషన్

న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిరానికి ముందే దేవాలయం మోడల్‌లో రైల్వే స్టేషన్ నిర్మాణం కాబోతున్నది. ఈ రైల్వే స్టేషన్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను త్వరితంగా చేపట్టనున్నట్టు అధికారులు వెల్లడించారు. దీని కోసం అయోధ్య స్టేషన్‌కు కేటాయించిన రూ. 80 కోట్లను రూ. 104 కోట్లకు పెంచినట్టు రైల్వే శాఖ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. అయోధ్య రామ మందిరానికి వచ్చే కోట్లాది యాత్రికులను దృష్టిలోపెట్టుకుని అయోధ్య స్టేషన్‌ను రైల్వే శాఖ రీడెవలప్ చేస్తున్నదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి […]

Update: 2020-08-03 10:17 GMT

న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిరానికి ముందే దేవాలయం మోడల్‌లో రైల్వే స్టేషన్ నిర్మాణం కాబోతున్నది. ఈ రైల్వే స్టేషన్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను త్వరితంగా చేపట్టనున్నట్టు అధికారులు వెల్లడించారు. దీని కోసం అయోధ్య స్టేషన్‌కు కేటాయించిన రూ. 80 కోట్లను రూ. 104 కోట్లకు పెంచినట్టు రైల్వే శాఖ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది.

అయోధ్య రామ మందిరానికి వచ్చే కోట్లాది యాత్రికులను దృష్టిలోపెట్టుకుని అయోధ్య స్టేషన్‌ను రైల్వే శాఖ రీడెవలప్ చేస్తున్నదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ఆదివారం ట్వీట్ చేశారు. ప్రస్తుత రైల్వే స్టేషన్ కూడా ఆలయం మాదిరిగానే ఉన్నప్పటికీ కేంద్రం దీనికి భారీగా మార్పులు చేసి గ్రాండ్‌గా తీర్చిదిద్దబోతున్నది. ఈ రీడెవలప్‌మెంట్ రెండు దశల్లో సాగనుంది. తొలి దశలో ప్లాట్‌ఫామ్ ఏరియాను అభివృద్ధి చేయగా, రెండో దశలో స్టేషన్ బిల్డింగ్‌ నిర్మాణంతోపాటు మరిన్ని టాయిలెట్టు, డార్మిటరీలు, టికెటింగ్ సహా ఇతర సదుపాయాలను పెంచేలా ఏర్పాట్లుంటాయి.

Tags:    

Similar News