CM Revanth Reddy : అదానీ కంపెనీతో ఒప్పందాలపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ
అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీ(Adani Group Of Compeny)తో ఒప్పందాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మీడియా సమావేశం నిర్వహించి క్లారిటీ ఇచ్చారు.
దిశ, వెబ్ డెస్క్ : అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీ(Adani Group Of Compeny)తో ఒప్పందాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మీడియా సమావేశం నిర్వహించి క్లారిటీ ఇచ్చారు. "గత కొద్దిరోజులుగా అదానీ కంపెనీపై పలు దేశాల్లో వివాదాలు, చర్చలు నడుస్తున్నాయి. ఈ చర్చల్లో భాగంగా మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా ఓ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతుండగా.. ఓ వైపు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అదానీ కంపెనీతో పలు ఒప్పందాలు చేసుకుంటుందని, మరోవైపు మీరు మాత్రం అదానీని ఎలా ప్రశ్నిస్తారు అంటూ పలువురు పాత్రికేయులు ప్రశ్నలు సంధించారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని చట్టబద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా ఏదైనా అంశంలో టెండర్లు పిలిచినప్పుడు నిబంధనల ప్రకారం అర్హులైన వారికి, నియమాలకు లోబడి అవి కేటాయించబడతాయి. అదానీ మాత్రమే కాదు.. దేశంలో ఎవరికైనా టెండర్లు లేదా పెట్టుబడుల నిబంధనల ప్రకారం ఇవ్వడం జరుగుతుందని, వాటిలో ఎవరి ప్రమేయం గాని, వ్యక్తిగత ఉద్దేశాలు గాని ఉండవు" అన్నారు. "ఒకసారి పెట్టుబడులు తీసుకోవడం గాని, టెండర్లు కేటాయించడం గాని జరిగిన తర్వాత నిర్ధిష్టమైన కారణాలు లేకుండా వాటిని రద్దు చేస్తే.. ఆయా కంపెనీలు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు కూడా చాలా ఒప్పందాలు చేసుకున్నారు.. అదానీ కంపెనీకి లెక్కలేనన్ని కాంట్రాక్టులు, భూములు ఇచ్చారు.. కేసు పెట్టాల్సి వస్తే బీఆర్ఎస్ నాయకుల మీద కూడా కేసులు పెట్టాలి" అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
"అయితే పెట్టుబడులు వేరు.. విరాళం వేరు.. పెట్టుబడులు రద్దు చేస్తే పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది గాని, విరాళాలు వెనక్కి ఇస్తే ఏ సమస్య లేదు. అదానీ కంపెనీ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ(Young India Skill University)కి ఇచ్చిన విరాళాన్ని వెనక్కి ఇవ్వడం ద్వారా మేము చెప్పేది ఏమంటే.. ఎవరైనా రాజ్యాంగ బద్ధంగా లేనివాళ్లకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉంటుందనే సంకేతం ఇస్తున్నాం. అనవసరంగా తెలంగాణ రాష్ట్రం, కాంగ్రెస్ పార్టీ వివాదాల్లో ఇరుక్కోవడం తనకు గాని, మంత్రిమండలికి గాని ఇష్టం లేదు, అందుకే అదానీ కంపెనీ విరాళాన్ని వెనక్కి ఇస్తున్నాం" అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.