Harish Rao : విద్యార్థిని శైలజ మృతిపై హరీష్ రావు స్పందన
వాంఖిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ(Shailaja) మృతి పట్ల బీఆర్ఎస్ నేత హరీష్ రావు స్పందించారు.
దిశ, వెబ్ డెస్క్ : వాంఖిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ(Shailaja) మృతి పట్ల బీఆర్ఎస్ నేత హరీష్ రావు స్పందించారు. శైలజకు కన్నీటి నివాళి అని సంతాపం ప్రకటించారు. విద్యార్థిని మృతికి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పూర్తి బాధ్యత వహించాలని పేర్కొన్నారు. గిరిజన విద్యార్థినిల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం, వారి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చిందని మండిపడ్డారు. విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా సెప్టెంబర్ 30న కలుషిత ఆహారం తిని వాంఖిడి ఆశ్రమ పాఠశాలలోని పలువురు విద్యార్థినిలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కాగా వారిలో శైలజ అనే విద్యార్థిని 22 రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ నేడు తుది శ్వాస విడిచింది. గత కొద్దిరోజులుగా శైలజను వెంటిలేటర్ పై ఉంచిన నిమ్స్ వైద్యులు, అత్యాధునిక చికిత్స అందించినప్పటికీ ఫలిత, లేకపోయింది.