Harish Rao : అదాని విషయంలో కాంగ్రెస్ ద్వందవైఖరి : హరీష్ రావు
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ(Young India Skill University)కి అదాని(Adani) ఇచ్చిన విరాళాన్ని నిరాకరిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటించిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్ : యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ(Young India Skill University)కి అదాని(Adani) ఇచ్చిన విరాళాన్ని నిరాకరిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harish Rao) స్పందించారు. అదాని విషయంలో కాంగ్రెస్ ద్వందవైఖరి పాటిస్తోందని మండిపడ్డారు. విరాళాలు తిరస్కరించారు.. మరి దావోస్(Dawos) వేదికగా చేసుకున్న ఒప్పందాల సంగతి ఏమిటని హరీష్ రావు ప్రశ్నించారు. దావోస్ లో అదాని కంపెనీతో చేసుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాలను కూడా ఇలాగే తిరస్కరించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ డిస్కంలను అదాని కంపెనీకి కట్టబెట్టే సంగతిపై కూడా రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వాలని అన్నారు. అదాని కంపెనీపై అవినీతి బయటకు రాగానే ఇప్పుడు మాట మారుస్తున్నారని, కాంగ్రెస్ ద్వంద ప్రమాణాలు పాటిస్తోందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలో ఉన్నపుడు 20 వేల మెగా వాట్ల థర్మల్ ప్లాంట్ పెడతామని అదాని గ్రూప్ ముందుకు వస్తే.. నిర్మొహమాటంగా తిరస్కరించిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ మేరకు హరీష్ రావు తన 'ఎక్స్'(X) ఖాతా వేదికగా పోస్ట్ చేశారు.