R.Krishnaiah: 'ఇది రాసిపెట్టుకోండి'.. బీసీ ఉద్యమంపై ఆర్.కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు

బీసీ ఉద్యమంపై ఆర్.కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-25 10:40 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీ ఉద్యమం (BC movement) కీలక దశకు వచ్చిందని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య (R. Krishnaiah)  అన్నారు. విద్యా, ఉద్యోగం, అధికారంలో వాటా కోసం పోరాడిన మనం ఇప్పుడు రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తున్నామని ఇక ఉద్యమ పంథాను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. దీని కోసం రాంత్రిబవళ్లు మేధావులతో చర్చలు జరుపుతున్నామన్నారు. సోమవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన బీసీ సమరభేరీ (BC Samara Bheri) సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఇన్నాళ్లు మనం ఏ పోరాటం చేసినా బడుగుల ఆత్మగౌరవంతో ఒక ఎజెండాతోనే పని చేశామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో బీసీ భావం పెరిగిపోయిందన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో ఈ ప్రభుత్వాలు బీసీలను అభివృద్ధి వైపు తీసుకువెళ్లలేకపోయాని పేదవారిని మరింత పేదలుగా మార్చాయని ధ్వజమెత్తారు.

రాసిపెట్టుకోండి..

బీసీ వాదం ఎత్తుకున్నందుకే వీ.హనుమంతరావుకు కేంద్ర మంత్రి పదవి, సీఎం పోస్టు రాలేదన్నారు. ప్రజలు ఉద్యమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని నాయకులందరూ బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తే ఉద్యమ పంథానే మార్చేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. చట్టసభల్లో రిజర్వేషన్లు (BC Reservation) సాధ్యం అవుతుందా అని సందేహించవచ్చని కానీ తప్పనిసరిగా ఈ రిజర్వేషన్లు సాధించుకుంటామన్నారు. ఇది తప్పనిసరిగా జరుగుతుందని ఇది రాసిపెట్టుకోండన్నారు. లోకల్ బాడీ రిజర్వేషన్లు సాధ్యం కాదని గతంలో చెప్పారని కానీ ప్రభుత్వాలను ఒప్పించి 34 శాతం రిజర్వేషన్లు సాధించుకున్నామని గుర్తు చేశారు. మన ఉద్యమంలో న్యాయం ఉందని చెప్పారు. నాయకుల మద్దతుతోనే తాను ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించానని నాయకులకు పేరు రాకపోయినా ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

ప్రజల చైతన్యాన్ని మరువద్దు:

నాయకులు కేవలం మాటలకే పరిమితం అవుతారా లేక మనకోసం ఏదైనా చేస్తారా అనేదానిపై ప్రజల్లో చైతన్యం ఉందన్నారు. నేను ఏ పార్టీ సభ్యత్వం నాకు లేదన్నారు. తాను బీసీ జెండాను తప్పా ఏ పార్టీ జెండా మోయలేదన్నారు. అందువల్లే అన్ని పార్టీలు నాకు పదవులు ఇచ్చేందుకు నా వద్దకు వస్తాయన్నారు. నాయకులు

Tags:    

Similar News