తిరుమల లడ్డూ వివాదం.. ఆ లడ్డూకు భారీగా పెరిగిన డిమాండ్!

ఏపీలో తిరుమల లడ్డూ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ లడ్డూ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Update: 2024-09-22 08:24 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో తిరుమల లడ్డూ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ లడ్డూ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న పుణ్యక్షేత్రం అటువంటి ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని వినియోగించడం పై దేశవ్యాప్తంగా పలువురు మంత్రులు, అధికారులు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన లడ్డూ వివాదం పై మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

అది ఏంటంటే.. తిరుమల శ్రీవారి లడ్డూ(Tirumala Laddu) చుట్టూ వివాదాలు ఉన్నాయని దీంతో లడ్డూ విక్రయాలు తగ్గుతాయని భావించారు. కానీ ఒక్కసారిగా తిరుమల లడ్డూకు భారీగా డిమాండ్ పెరిగిందని టీటీడీ(TTD) అధికారులు వెల్లడించారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వాడారన్న వార్తలతో ఎవరూ కొనుగోలు చేయకుండా ఉండలేదు. లడ్డూ వివాదం తిరుమల లడ్డూ విక్రయాలపై ప్రభావం చూపలేదని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల లడ్డూ తయారీలో తప్పిదాలు జరిగిన శ్రీవారి లడ్డూను పరమ పవిత్రంగా భక్తులు భావించడమే ఇందుకు కారణమంటున్నారు. ఈ నెల 19న 3.59 లక్షలు, 20న 3.16 లక్షలు, 21న 3.66 లక్షల లడ్డూలను శ్రీవారి భక్తులు కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు.


Similar News