DSC Exams:డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే!
డీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న మైనారిటీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
దిశ,వెబ్‌డెస్క్: డీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న మైనారిటీ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఉచిత డీఎస్సీ శిక్షణకు అర్హులైన మైనారిటీ విద్యార్థుల (ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలు, జైనులు) నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎన్‌టీఆర్ జిల్లా మైనారిటీల ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు ఎస్.కె.ఫర్జానా బేగం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో దీనికి సంబంధించి www.apcedmmwd.org వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు డైరెక్టర్, సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్, స్వాతి థియేటర్ ఎదురుగా, భవానీపురం, విజయవాడ-520012 (ఫోన్: 0866 - 2970567)లో సంప్రదించాలని సూచించారు.