కడపలో దంచి కొట్టిన వర్షం.. జలమయమైన ఆర్టీసీ బస్టాండ్

వైఎస్ఆర్ జిల్లాలో బుధవారం పలు చోట్ల వర్షాలు కురవగా జిల్లా కేంద్రమైన కడప నగరంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల వరకు భారీ వర్షం దంచి కొట్టింది.

Update: 2024-12-04 14:55 GMT

దిశ,కడప: వైఎస్ఆర్ జిల్లాలో బుధవారం పలు చోట్ల వర్షాలు కురవగా జిల్లా కేంద్రమైన కడప నగరంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల వరకు భారీ వర్షం దంచి కొట్టింది. కొద్దిసేపు తెరిపించిన మళ్లీ భారీగా వర్షం కురవడంతో కడప నగరంలోని రోడ్లు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. సాయంత్రం 7:30 వరకు కురుస్తూనే ఉన్న వర్షాల కారణంగా నగరంలోని డ్రైనేజీలో పొంగిపొర్లాయి. కడప పట్టణంలోని కోటిరెడ్డి సర్కిల్ -ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు జిల్లా కోర్టు నుంచి బస్టాండ్ వరకు జలమయం అయింది. ఆర్టీసీ బస్టాండ్‌లో పెద్ద ఎత్తున నీళ్లు నిలిచాయి. మృత్యుంజయ కుంట ప్రాంతంలో , అప్సరా రోడ్డు, కేశవరెడ్డి స్కూల్ రోడ్డు తదితర ప్రాంతాల్లో నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


Similar News