క్లాస్ రూమ్‌లో దారుణం.. టీచర్‌ను కొట్టి చంపిన విద్యార్థులు
టీచర్‌ను విద్యార్థులు కొట్టి చంపిన ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది...
దిశ, వెబ్ డెస్క్: టీచర్‌ను విద్యార్థులు కొట్టి చంపిన ఘటన అన్నమయ్య జిల్లా(Annamaya District)లో జరిగింది. రాయచోటి జిల్లా పరిషత్ ఉర్దూ హైస్కూల్(Rayachoti Zilla Parishad Urdu High School)లో పని చేస్తున్న ఉపాధ్యాయుడు ఏజాస్(Teacher Ejas) రోజూ మాదిరిగానే బుధవారం కూడా 9వ తరగతి క్లాసులకు వెళ్లారు. అయితే విద్యార్థులు అల్లరి చేయడంతో ఏజాస్ మందలించారు. దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్థులు ఒక్కసారిగా ఉపాధ్యాయుడిపై దాడి చేశారు. చాతిపై కొట్టడంతో ఏజాస్ క్లాస్ రూమ్‌లోనే సొమ్మసిల్లి పడిపోయారు. ఏజాస్‌ను తోటి ఉపాధ్యయులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ టీచర్ ఏజాస్ మృతి చెందారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.