Pushpa-2 Movie: అచ్చం అల్లు అర్జున్ గెటప్‌లో అభిమాని సందడి (వీడియో వైరల్)

అచ్చం అల్లు అర్జున్ గెటప్‌లో అభిమాని సందడి చేశారు..

Update: 2024-12-04 17:25 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాలతో పాటు ప్యాన్ ఇండియా లెవల్‌లో పుష్పా-2 సినిమా(Pushpa-2 movie) విడుదలైంది. ప్రత్యేక షోలతో అత్యధిక థియేటర్లలో ఈ మూవీ ప్రదర్శితమవుతోంది. దీంతో థియేటర్లకు హీరో అల్లు అర్జున్(Hero Allu Arjun) ఫ్యాన్స్ పోటెత్తారు. పుష్పా-2లో అల్లు అర్జున్ వేసిన గెటప్‌లో థియేటర్ల వద్దకు చేరుకుని సందడి చేస్తున్నారు. కాగా పుష్ప -2లో అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే సినిమా విడుదల సందర్భంగా శ్రీకాకుళం జిల్లా(Srikakulam District) టెక్కలి భవానీ థియేటర్‌(Tekkali Bhavani Theatre)లో అల్లు అర్జున్ అభిమాని అమ్మవారి గెటప్ వేసి సందడి చేశారు. థియేటర్ వద్ద ఉన్న బన్నీ ఫ్యాన్స్‌ను ఆ గెటప్ ఎంతగానో ఆకట్టుకుంది. అతడితో కలిసి అభిమానులూ చిందులు వేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Tags:    

Similar News