లారీలో పేపర్ బండిళ్ల మధ్య ఎర్రచందనం.. గుట్టు రట్టు చేసిన పోలీసులు
లారీలో తరలిస్తున్న 10 టన్నుల ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ....
దిశ, వెబ్ డెస్క్: లారీలో తరలిస్తున్న 10 టన్నుల ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగింది. ఎర్రచందనం తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు చెన్నై నుంచి విశాఖ వైపు వెళ్తున్న లారీలో సోదాలు చేశారు. పేపర్ బండిళ్ల మధ్య 10 టన్నుల ఎర్రచందనాన్ని గుర్తించారు. లారీని, ఎర్రచందనం దుంను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే లారీ డ్రైవర్ పరారీలో ఉండటంతో లారీ నెంబర్ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.