‘చిత్రగుప్తుడు రాయలేనన్ని పాపాలు చేశారు’.. పెద్దిరెడ్డి పై టీడీపీ నేత ఫైర్

చిత్ర గుప్తుడు కూడా రాయలేనన్ని‌ పాపాలు మాజీ సీఎం జగన్​ జమానాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి చేశారని టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర ఆరోపణలు చేశారు.

Update: 2025-03-19 09:42 GMT
‘చిత్రగుప్తుడు రాయలేనన్ని పాపాలు చేశారు’.. పెద్దిరెడ్డి పై టీడీపీ నేత ఫైర్
  • whatsapp icon

దిశ, ఏపీ బ్యూరో : చిత్ర గుప్తుడు కూడా రాయలేనన్ని పాపాలు మాజీ సీఎం జగన్​ జమానాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి చేశారని టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వీరంతా మద్యం అడ్డు పెట్టుకుని వేల మంది ప్రాణాలు తీశారని మండిపడ్డారు. మద్యం, మైనింగ్ లో దోచుకున్న దోపిడీతో డబ్బు మదం పట్టిందన్నారు.

ఈ డబ్బుతోనే కుప్పంలో చంద్రబాబును గెలవనివ్వమని రంకెలు వేశారని విమర్శించారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేయని స్కాం లేదు, చేయని కబ్జా లేదని ఆరోపించారు. చంద్రబాబు మీలాగా దౌర్జన్యాలు చేయిస్తే అసలు రోడ్ల మీదకు వచ్చేవారా ప్రశ్నించారు. పుంగనూరులో టీడీపీ కార్యకర్తను చంపించారని, ఇక చంద్రబాబు, లోకేష్​ మిమ్మల్ని వదలరని హెచ్చరించారు. ఈ హత్య కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. తప్పు చేసిన ఎవరైనా జైలుకు వెళ్లక తప్పదని వెంకన్న స్పష్టం చేశారు.


Similar News