Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

తిరుమల తిరుపతి (Tirupati) కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది.

Update: 2025-03-23 05:13 GMT
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి (Tirupati) కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం కావడంతో భక్తులు (Devotees) భారీగా శ్రీవారి దర్శనం కోసం తరలివస్తున్నారు. దీంతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి బయట ఏటీజీహెచ్ వరకూ క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. అలాగే, టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు 6 గంటల సమయం, రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు 4 గంటల సమయం దర్శనం పడుతుంది.

వేసవి తీవ్రత భక్తులకు తగలకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చర్యలు తీసుకున్నారు. క్యూ లైన్‌లో ఉన్నవారికి, కంపార్ట్‌మెంట్లలో భక్తులకు శ్రీవారి సేవకులు చల్లటి మజ్జిగ, మంచినీరు, అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. అలాగే, కంపార్ట్‌మెంట్లలోనూ ఎయిర్‌ కూలర్లను పెట్టి చల్లదనాన్ని నింపుతున్నారు.

ఇక నిన్న తిరుమల శ్రీవారిని 75,428 మంది భక్తులు దర్శించుకోగా, 31,920 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.40 కోట్లు వచ్చిందని అధికారుల తెలిపారు.

Tags:    

Similar News