Good News: మళ్లీ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్
విశాఖ రుషికొండ బీచ్‌కు మళ్లీ బ్లూ ఫాగ్ సర్టిఫికేషన్ లభించింది...

దిశ, వెబ్ డెస్క్: విశాఖ రుషికొండ బీచ్(Visakhapatnam Rushikonda Beach)కు మళ్లీ బ్లూ ఫాగ్ సర్టిఫికేషన్(Blue Fog Certification) లభించింది. ఈ మేరకు గుర్తింపు పత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. కాగా ఇటీవల కాలంలో రుషికొండ బీచ్‌కు బ్లూ ఫాగ్ గుర్తింపు తాత్కలికంగా రద్దయిన విషయం తెలిసిందే. 600 మీటర్ల తీర ప్రాంతం బ్లూ ఫాగ్ కలిగి ఉండటంతో 2020లో గుర్తింపు దక్కింది. రుషికొండ బీచ్‌కు డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ బ్లూగ్ ఫాగ్ గుర్తింపు ఇచ్చింది. అయితే కొంతకాలంగా బీచ్‌లో కుక్కలు తిరగడం, సీసీ కెమెరాలు సరిగా పని చేయకపోవడం, వ్యర్థాలు పేరుకుపోవడం, దుర్గంధం వెదజల్లడం, నడక మార్గం దెబ్బతినడం వంటివి గుర్తించి ఫొటోలు తీసి కొందరు డెన్మార్క్ సంస్థకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ బీచ్‌కు బ్లూ ఫాగ్ గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అప్రమత్తమై బీచ్‌ను శుభ్రం చేసింది. మళ్లీ బ్లూ ఫాగ్ వచ్చేలా చర్యలు చేపట్టింది. దీంతో రుషికొండ బీచ్‌కు బ్లూ ఫాగ్ సర్టిఫికేషన్ తిరిగి వచ్చింది.