CM Chandrababu: బడులు తెరవగానే వారికి రూ.15 వేలు.. : సీఎం చంద్రబాబు ప్రకటన

పాఠశాలలు తెరిచేలోగా తల్లికి వందనం నగదును అందజేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు.

Update: 2025-03-25 06:09 GMT
CM Chandrababu: బడులు తెరవగానే వారికి రూ.15 వేలు.. : సీఎం చంద్రబాబు ప్రకటన
  • whatsapp icon

దిశ డైనమిక్ బ్యూరో: పాఠశాలలు తెరిచేలోగా తల్లికి వందనం నగదును అందజేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు.మే నెలలో ఈ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇస్తామని సీఎం తెలిపారు. అధికారులు దర్పాన్ని ప్రదర్శించడం కాదు.. ప్రజలకు ఆమోదయోగ్యంగా పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఒక్కో నాయకుడి పాలన ఒక్కోలా ఉంటుంది, కొందరు అభివృద్ధి చేస్తే.. మరికొందరు నాశనం చేస్తారని అన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ప్రజలకు హామీఇచ్చామని గుర్తు చేశారు. గత వైసీపీ పాలనను ప్రజలు ఆమోదించలేదన్నారు. గత పాలనతో ప్రజలు విసిగి తమకు సంపూర్ణ మద్దతు ఇచ్చారని తెలిపారు. తొమ్మిది నెలల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజవంతానికి పది సూత్రాలను అమలు చేస్తున్నామన్నారు. జిల్లాకు ఏడుగురు ఉత్తమ అధికారులను ఎంపిక చేసి స్పెషల్​ ఆఫీసర్​గా ఉంచుతామన్నారు. విజన్​ డాక్యుమెంట్​ను అమలు చేయడానికి సచివాలయాన్ని ఒక యూనిట్​గా తీసుకుంటామని తెలిపారు. అమరావతిని 2027లోగా పూర్తి చేస్తామన్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ వంటి సంస్థల నుంచి ఆర్థిక సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. ల్యాండ్​ మానిటైజేషన్​ ద్వారా ఈ అప్పులు తీర్చేస్తామన్నారు.. ప్రజలు కూడా భాగస్వాములు అయ్యేలా చర్యు ఉండాలన్నారు. వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయన సూచించారు. 

Tags:    

Similar News