Vallabhaneni Vamsi: సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసు.. కాసేపట్లో వంశీ బెయిల్‌ పిటిషన్‌పై తుది తీర్పు

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ విజయవాడ (Vijayawada) ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు (SC and ST Special Court) తుది తీర్పును వెలువరించనుంది.

Update: 2025-03-28 06:01 GMT
Vallabhaneni Vamsi: సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసు.. కాసేపట్లో వంశీ బెయిల్‌ పిటిషన్‌పై తుది తీర్పు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ విజయవాడ (Vijayawada) ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు (SC and ST Special Court) తుది తీర్పును వెలువరించనుంది. అయితే, గన్నవరం (Gannavaram) టీడీపీ కార్యాలయం (TDP Office)పై దాడి కేసులో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై సీఐడీ కోర్టు (CID Court)లో వాదనలు ముగియగా.. గురువారం న్యాయమూర్తి ఆయన బెయిల్ పిటిషన్‌ (Bail Petition)ను డిస్మస్ చేస్తూ తీర్పును వెలువరించారు. మరోవైపు ఇవాళ సత్యవర్ధన్ (Satyavardhan) కిడ్నాప్, బెదిరింపు కేసులో ఇరు పక్షాలు తమ వాదనలు వినిపించారు. ఈ మేరకు ఇవాళ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు వంశీ బెయిల్ పిటిషన‌పై తుది తీర్పును వెలువరించనుంది. ప్రస్తుతం అదే కేసులో అరెస్ట్‌ అయిన వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) ప్రస్తుతం రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇప్పుడైనా బెయిల్.. వస్తుందా రాదా అనే టెన్షన్ ఇటు వైసీపీ (YCP) శ్రేణుల్లోనూ.. అటు కుటుంబ సభ్యుల్లోనూ ఆందోళన నెలకొంది.

కాగా, గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సత్యవర్ధన్‌ను కిడ్నాప్‌ చేసి బెదిరించారడని నమోదైన కేసులో వల్లభనేని వంశీ ఫిబ్రవరి 13న అరెస్ట్ అయ్యారు. ఈ మేరకు ఆయనను పటమట పోలీసులు.. హైదరాబాద్‌ రాయదుర్గంలోని మైహోం భుజాలో ఉండగా అరెస్ట్‌ చేసి విజయవాడకు తీసుకెళ్లారు. దళిత యువకుడి కిడ్నాప్‌, దాడి నేపథ్యంలో వల్లభనేని వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదైన విషయం తెలిసిందే.

Tags:    

Similar News