కీలక పరిణామం.. మాజీ మంత్రి విడదల రజినిపై ఏసీబీ కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో మాజీ మంత్రికి చిక్కులు ఎదురయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అవినీతి అక్రమాలపై తాజాగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో మాజీ మంత్రికి చిక్కులు ఎదురయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాం (YSRCP government rule) లో చేసిన అవినీతి అక్రమాలపై తాజాగా కూటమి ప్రభుత్వం (coalition government) చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు కాగా.. విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో మహిళా మంత్రిపై ఏసీబీ అధికారులు (ACB officers) కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి విడదల రజిని (Former Minister Rajini)తో సహా మరికొందరిపై తాజాగా కేసు నమోదైంది (case has been registered). గత ప్రభుత్వం హయాంలో 20202 సెప్టెంబర్ నెలలో పల్నాడు (D) యడ్లపాడులోని లక్ష్మీబాలజీ స్టోన్ క్రషర్ ఓనర్‌ని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించారు. అనంతరం అతని వద్ద రూ. 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రషర్ యజమాని ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.
అనంతరం మంత్రితో పాటు ఇతరులు అక్రమాలకు పాల్పడినట్లు తేల్చడంతో.. మాజీ మంత్రి (Former Minister) తో పాటు ఆమెకు సహకరించిన వారిపై కేసు నమోదు చేయాలని ప్రభుత్వం ఏసీబీకి ఆదేశించింది. దీంతో ఏసీబీ అధికారులు (ACB officers).. మాజీ మంత్రి అయిన విడదల రజినిని ఏ1 నిందితురాలిగా చేర్చారు. వారిపై అవినీతి నిరోధక చట్టంలోని 7, 7 ఏ ఐపీసీ 384, 120 బీ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. అయితే మంత్రి అక్రమాలకు అండగా నిలిచినందుకు గాను ఐపీఎస్ అధికారి జాషువాను (IPS officer Joshua) ఈ కేసులో రెండో నిందితుడిగా చేర్చారు. అలాగే డబ్బుల కోసం మైనింగ్ వ్యాపారిని బెదిరించిన విడదల రజిని (Rajini) మరిది గోపితో పాటు ఆమె వ్యక్తిగత సహాయకుడు దొడ్డ రామకృష్ణను ఏసీబీ నిందితులుగా పేర్కొంది. అవినీతి నిరోధక శాఖలోని సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్(CIU) శనివారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.