ఫాస్ట్ ఫుడ్‌లో పురుగులు.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమా!

ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అపరిశుభ్రతకు ఆనవాళ్లుగా మారాయి.

Update: 2025-03-27 15:22 GMT
ఫాస్ట్ ఫుడ్‌లో పురుగులు.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమా!
  • whatsapp icon

దిశ,ఉరవకొండ: ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అపరిశుభ్రతకు ఆనవాళ్లుగా మారాయి. ఇష్టారాజ్యంగా నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు సాగిస్తున్నారు. పంచాయతీ అధికారులు మొద్దు నిద్రలో జోగుతున్నారు. మేజర్ గ్రామపంచాయతీలో గత 25 సంవత్సరాలుగా సానిటరీ ఇన్స్పెక్టర్ అధికారి పోస్టు ఖాళీగా ఉంది. పాలకులు ఆ పోస్టును ఖాళీ చేయటంలో చోద్యం చూస్తున్నారు అనే విమర్శలు తలెత్తుతున్నాయి. ఫాస్ట్ ఫుడ్ ప్రియులు సెంటర్లో లొట్టలేసుకుని తినే ఆహారం ఎలా ఉందో ఒకసారి గమనిస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. తినే ఫుడ్ లో బొద్దింకలు వచ్చిన అలాగే సరఫరా చేస్తున్నారు.

తాజాగా ఒక వ్యక్తి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కెళ్ళి పార్సిల్ కట్టించుకున్నారు. ఇంటికెళ్లి చూస్తే అందులో బొద్దింకలు వచ్చాయి. ఆయన కంగుతిన్నారు. విక్రేతను నిలదీశారు. సానిటరీ అధికారికి ఫిర్యాదు చేస్తామంటే ఆ పోస్తే జాడే లేకపోవడం తో ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కాని పరిస్థితి. సరి కదా పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఫాస్ట్ ఫుడ్ విక్రతలపై కఠిన నిబంధనలు విధించి పరిశుభ్రమైన ఆహారాన్ని విక్రయించే దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఉరవకొండ మేజర్ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం రోజురోజుకు పంచాయతీ పరిధిలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో అశుభ్రమైన ఆహారం విక్రయిస్తున్నారు. కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో నాణ్యతలేని ఆహారం అందిస్తున్నారు పానీ పూరి కబాబ్ సెంటర్లలో నాన్న తెలియని ఆహారపు వస్తువులను వినియోగిస్తున్నారు సదరు పంచాయతీ అధికారులు మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉరవకొండ లోని పానీ పూరి కబాబ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించాలి ప్రజలు కోరుతున్నారు. అశుభ్రమైన ఆహారం తిని ఆసుపత్రి పాలవుతున్నారు.

Similar News