లాసెట్-2025 నోటిఫికేషన్ విడుదల.. అప్లికేషన్‌కు డైరెక్ట్ లింక్ ఇదే!
ఆంధ్రప్రదేశ్‌లో 2025-26 సంబంధించిన లాసెట్ నోటిఫికేషన్ విడుదలైంది
దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో 2025-26 సంబంధించిన లాసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి, అర్హతగల విద్యార్థులు అన్‌లైన్‌లో వచ్చే నెల(ఏప్రిల్) 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ క్రమంలో LLB మూడేళ్ల, ఐదేళ్ల కోర్సు, LLM రెండేళ్ల కోర్సులకు ఎంట్రాన్స్ ఎగ్జామ్‌ను పద్మావతి యూనివర్సిటీ జూన్ 5న నిర్వహించనుంది. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశానికి డిగ్రీలో 45 శాతం మార్కులు సాధించాలి.
బీసీ అభ్యర్థులు 42 శాతం, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు 49 శాతం మార్కులు సాధించి ఉండాలి. 5 సంవత్సరాల ఇంటిగ్రేటేడ్ LLB కోర్సుకు ఇంటర్‌లో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. బీసీలు 42 శాతం, ఎస్సీ ఎస్టీ 40 శాతం ఉండాలి. LLB చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. LLB ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇంగ్లీష్, తెలుగు రెండు భాషల్లో ఉంటుంది. LLM పరీక్ష ఇంగ్లీష్ లోనే ఉంటుంది. లాసెట్ పరీక్షను మూడు విభాగాల్లో మొత్తం 120 మార్కులకు నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx ను సందర్శించండి.
దరఖాస్తు ఫీజు: LLB కోర్సుకు OC అభ్యర్థులకు రూ.900, BC అభ్యర్థులు రూ.850, SC, STలు రూ.800 చెల్లించాలి. LLM కోర్సుకు OC రూ.1000, BCరూ.950, SC, ST అభ్యర్థులకు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది.