ఆ పోలీసులను ఉపేక్షించం: పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్

నేరస్తులకు అండగా ఉండే పోలీసులను అసలు ఉపేక్షించమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరించారు...

Update: 2025-03-27 15:49 GMT
ఆ పోలీసులను ఉపేక్షించం: పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: నేరస్తులకు అండగా ఉండే పోలీసులను అసలు ఉపేక్షించమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) హెచ్చరించారు. పిఠాపురం నియోజకర్గంలో శాంతి భద్రతల(Peace and security)పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు పోలీసులు అవినీతికి పాల్పడుతున్నారని, వాళ్ల వల్ల మొత్తం డిపార్ట్‌మెంట్ పరువు పోతోందని మండిపడ్డారు. పిఠాపురంలోని నాలుగు పోలీస్ స్టేషన్లలోని పరిస్థితిపై ఇంటెలిజెన్స్ నివేదిక తీసుకోవాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని పోలీసులను ఆయన ఆదేశించారు. పిఠాపురం-ఉప్పాడ రైల్వే గేటు(Pithapuram-Uppada Railway Gate)వద్ద ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

అంతకుముందు పురపాలక అధికారులతోనూ పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. పిఠాపురం నియోజకవర్గంలో సమ్మర్ స్టోరేజీ ట్యాంక్స్ వద్ద తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అమృత్ 2.0 ద్వారా తాగు నీటి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రూ. 40.2 కోట్లతో 444 రోడ్డు పనులు చేసినట్లు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గానికి 431 గోకులాలను ఇచ్చినట్లు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News