ఏసీబీ కేసుపై స్పందించిన విడదల రజిని

విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి అక్రమంగా డబ్బులు వసూళ్లకు పాల్పడినట్లు తేలడంతో మాజీ మంత్రి విడదల రజిని (Former Minister Rajini)తో సహా మరికొందరిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

Update: 2025-03-23 05:39 GMT
ఏసీబీ కేసుపై స్పందించిన విడదల రజిని
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి అక్రమంగా డబ్బులు వసూళ్లకు పాల్పడినట్లు తేలడంతో మాజీ మంత్రి విడదల రజిని (Former Minister Rajini)తో సహా మరికొందరిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో 20202 సెప్టెంబర్ నెలలో పల్నాడు (D) యడ్లపాడులోని లక్ష్మీబాలజీ స్టోన్ క్రషర్ ఓనర్‌ని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించారు. అనంతరం అతని వద్ద రూ. 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రషర్ యజమాని ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అధికారులు (Vigilance officers) కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి.. అక్రమాలకు పాల్పడినట్లు తేల్చారు. దీంతో ప్రభుత్వం సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ చేయాలని ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది.

దీంతో మాజీ మంత్రి (Former Minister) తో విడదల రజినితో పాటు ఆమెకు సహకరించిన వారిపై కేసు నమోదు చేశారు.ఈ కేసులో మాజీ మంత్రి (Former Minister) అయిన విడదల రజినిని ఏ1 నిందితురాలిగా చేర్చారు. వారిపై అవినీతి నిరోధక చట్టంలోని 7, 7 ఏ ఐపీసీ 384, 120 బీ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. కాగా తనపై నమోదైన ఏసీబీ కేసుపై మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజిని స్పందించారు. కూటమి ప్రభుత్వం తనపై కక్ష కట్టిందని, ఆధారాలు లేకుండా కేసులు పెడుతోందని విడదల రజిని (Vidadala Rajini) ఆరోపించారు. అలాగే బీసీ మహిళ అయిన తాను రాజకీయంగా ఎదగడాన్ని కూటమి ప్రభుత్వం లోని పెద్దలు తట్టుకోలేకపోతున్నారని.. తాను అక్రమకేసులకు (Illegal cases) భయపడను.. ఈ కేసులపై న్యాయపోరాటం చేస్తాని విడదల రజిని చెప్పుకొచ్చారు.


Similar News