బెల్టుతో కొడుతూ, కాళ్లతో తంతూ సీనియర్ విద్యార్థి పాశవిక దాడి

జిల్లాలోని కోడుమూరులో ఉన్న ఎస్సీ హాస్టల్ లో దారుణం చోటుచేసుకుంది. జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్థి బెల్టుతో కొడుతూ.. కాళ్లతో తంతూ అత్యంత పాశవికంగా వ్యవహరించాడు.

Update: 2025-03-26 02:10 GMT
బెల్టుతో కొడుతూ, కాళ్లతో తంతూ సీనియర్ విద్యార్థి పాశవిక దాడి
  • whatsapp icon

దిశ ప్రతినిధి, కర్నూలు : జిల్లాలోని కోడుమూరులో ఉన్న ఎస్సీ హాస్టల్ లో దారుణం చోటుచేసుకుంది. జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్థి బెల్టుతో కొడుతూ.. కాళ్లతో తంతూ అత్యంత పాశవికంగా వ్యవహరించాడు. 7, 8వ తరగతుల విద్యార్థులు ఇస్సాక్, రాజు బయటకు వెళ్లి ఆలస్యంగా తిరిగొచ్చారనే నెపంతో, అదే హాస్టల్‌లో పదో తరగతి చదువుతున్న కర్నూలు జిల్లా కేంద్రంలోని శరీన్ నగర్‌కు చెందిన మహేష్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ నెల 11న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో రావడంతో వైరల్‌గా మారాయి.

అధికారులు, నేతల పరామర్శ..

అప్రమత్తమైన సోషల్ వెల్ఫేర్ డీడీ ఎ.రంగలక్ష్మి, అసిస్టెంట్ డీడీ లీలావతి, జిల్లా విద్యాధికారి కె.శ్యామ్యూల్ పాల్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద, కోడుమూరు సీఐ తబ్రేజ్, ఎస్ఐ శ్రీనివాసులు, మండల విద్యాధికారి వసంత లక్ష్మి, వెంటనే వసతి గృహానికి చేరుకుని విచారణ చేపట్టారు. అదే క్రమంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్ బాబు, ఉపాధ్యక్షుడు కరుణాకర్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులతో పాటు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, ఇంచార్జి విష్ణువర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ పట్టణ అధ్యక్షులు బి.ఎల్లప్ప నాయుడు, టీఎన్టీయూసీ నాయకులు బీవీ గోపాల్ నాయుడు, ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బాలకృష్ణయ్య, మాలమహానాడు నాయకులు హాస్టల్ చేరుకుని పరిస్థితిపై ఆరా తీసి గాయపడిన విద్యార్థులను పరామర్శించారు.

పోలీసులు అదుపులో..

ఈ నెల 24న పదో తరగతి పరీక్ష రాసిన తర్వాత మహేష్ అనే విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విద్యార్థిని పరీక్షలు రాయిస్తారా ? లేక జువైనల్ కోర్టుకు తరలిస్తారా ? అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సీరియస్ అయ్యారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్ జి.రాముడును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


Similar News