కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవిపై కొత్తపల్లికి నో ఇంట్రెస్ట్
కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి పట్ల మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు నిరాశక్తతతో ఉన్నట్లు సమాచారం.

దిశ, పాలకొల్లు : కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి పట్ల మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు నిరాశక్తతతో ఉన్నట్లు సమాచారం. కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి తీసుకుంటే కేవలం తాను ఒక్క కాపు సామాజిక వర్గానికే పరిమితమైనట్లు సమాజంలో గుర్తింపు అయిపోతానని, తాను అన్ని సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తిని అని అందువల్ల ఒకే సామాజిక వర్గానికి చెందిన కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవిని తీసుకోకుండా నిరాకరిస్తున్నట్లు సమాచారం.
అందుకే కొత్తపల్లికి కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూటమి ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కొత్తపల్లి మాత్రం ఇంతవరకు ప్రమాణ స్వీకారం చేయలేదని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న తూర్పుగోదావరి కి చెందిన ఓ నేత, ఈ పదవిని చేజిక్కించుకునేందుకు ఇప్పటికే పైరవీలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే మనసు మార్చుకుని ఈ చైర్మన్ పదవిని కొత్తపల్లి తీసుకుంటారా, లేదంటే వేరే వారికి సీఎం చంద్రబాబు ఈ పదవి ఇస్తారా అనేది వేచి చూడాల్సిందే మరి.