సీఎం చంద్రబాబు పోలవరం పర్యటనలో ఆసక్తికర సన్నివేశం

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఇవాళ(గురువారం) పోలవరం(Polavaram) పనులను పరిశీలించేందుకు వెళ్లిన విషయం తెలిసిందే.

Update: 2025-03-27 10:29 GMT
సీఎం చంద్రబాబు పోలవరం పర్యటనలో ఆసక్తికర సన్నివేశం
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఇవాళ(గురువారం) పోలవరం(Polavaram) పనులను పరిశీలించేందుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుకు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్ ద్వారా పోలవరం చేరుకున్న సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్టు పనులను పరిశీలించారు.

ఇదిలా ఉండగా.. సీఎం చంద్రబాబు పోలవరం పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వైసీపీ మాజీ నేత, ఎమ్మెల్సీ (MLC) జయమంగళ వెంకటరమణ (Jayamangala Venkataramana) సీఎం చంద్రబాబు కాళ్లు మొక్కారు. అయితే గతంలో టీడీపీకి రాజీనామా చేసిన ఆయన వైసీపీలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కూటమి ప్రభుత్వం రాగానే పార్టీ మారతారని ఊహాగానాలు వినిపించాయి. అందులో భాగంగానే ఆయన ఇటీవల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా మండలి ఛైర్మన్ ఆమోదించలేదు. ఈ క్రమంలో ఆయన సీఎం చంద్రబాబు కాళ్లు మొక్కడం ప్రస్తుతం చర్చానీయాంశంగా మారింది.

Tags:    

Similar News