Vallabhaneni Vamsi: మళ్లీ బిగ్ షాక్.. పిటిషన్ డిస్మిస్
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బిగ్ షాక్ తగిలింది....

దిశ, వెబ్ డెస్క్: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Former Gannavaram MLA Vallabhaneni Vamsi)కి బిగ్ షాక్ తగిలింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని విజయవాడ కోర్టు(Vijayawada Court)లో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. గన్నవరం టీడీపీ ఆఫీసు(TDP Office)పై దాడి కేసులో కీలక నిందితుడిగా ఉన్న వంశీని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుతో పాటు మరిన్ని కూడా ఆయనపై నమోదు అయ్యాయి. ప్రస్తుతం వంశీ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తనకు బెయిల్ ఇవ్వాలని వంశీ కోరుతున్నారు. ఇందులో భాగంగా విజయవాడ కోర్టును ఆశ్రయించారు. కానీ ఆయనకు ఊరట లభించలేదు. వంశీ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. దీంతో వల్లభనేని వంశీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.