అద్దంకి-నార్కెట్‌పల్లి రోడ్డుపై ఘోరం.. 150 గొర్రెల మృతి

అద్దంకి-నార్కెట్‌పల్లి రోడ్డుపై ఘోరం జరిగింది..

Update: 2024-12-22 12:29 GMT

దిశ, వెబ్ డెస్క్: అద్దంకి-నార్కెట్‌పల్లి రోడ్డుపై ఘోరం జరిగింది. పులిపాడు వద్ద ట్రావెల్ బస్సు ఢీకొని 150 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల కాపరికి గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మంత్రి గొట్టిపాటి రవి స్పందించారు. గొర్రెల మృతిపై విచారణ వ్యక్తం చేశారు. క్షతగాత్రుడికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన గొర్రెలకాపరికి న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ట్రావెల్ యజమానులు, డ్రైవర్లతో సమావేశం ఏర్పాట్లు చేసి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. పొగమంచుతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, డ్రైవర్లు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని గొట్టిపాటి రవి సూచించారు. 

Tags:    

Similar News