దిశ, వెబ్‌డెస్క్: వైసీపీకి సొంత పార్టీ ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి పార్టీ వీడనున్నట్లు సమాచారం. వైసీపీ అధిష్టానంపై కోటంరెడ్డి గత కొన్ని రోజులుగా అంసతృప్తిగా ఉన్నారు. కోటంరెడ్డి తీరుపై అధిష్టానం సైతం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. నెల్లూరు రూరల్‌కి కొత్త ఇన్‌ఛార్జిని నియమించేందుకు వైసీపీ సమాయత్తమైంది. కాగా మంత్రి వర్గ విస్తరణలో తనకు ఛాన్స్ దక్కుతుందని కోటం రెడ్డి భావించారు.
కానీ అధిష్టానం కోటంరెడ్డిని కాకుండా నెల్లూరు జిల్లా నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రి వర్గంలో చోటు కల్పించింది. అప్పటి నుంచి అసంతృప్తిలో ఉన్న కోటంరెడ్డి ఇటీవల ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ ఇంటలిజెన్స్ అధికారులు తనపై నిఘా పెట్టారని, తన ఫోన్‌ను సైతం ట్యాప్ చేస్తున్నారన్నారు. అధికార పార్టీకి చెందిన తనపై ఎందుకు నిఘా పెడుతున్నారని గతంలో ఫైర్ అయ్యారు.
Also Read...
దూసుకుపోతున్న యువ నేతలు.. Chandrababu పిలిపించుకుని మెచ్చుకోవడంతో...