AP Budget: ఏపీ అసెంబ్లీ ప్రారంభం.. వార్షిక బడ్జెట్ రూ.2,94,427.25 కోట్లు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Sessions) ప్రారంభమయ్యాయి. మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) .. బడ్జెట్ ను (AP Budget) ప్రవేశపెట్టారు.
దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Sessions) ప్రారంభమయ్యాయి. మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) .. బడ్జెట్ ను (AP Budget) ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించారు. బడ్జెట్ కు అంకెలకు మించిన ప్రాముఖ్యత ఉందన్న ఆయన.. ఈసారి రాష్ట్రాన్ని కాపాడేందుకు బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నామన్నారు. గత ప్రభుత్వం రాబోయే 25 ఏళ్ల ఆదాయాన్ని తగ్గించిందని విమర్శించారు. అలాగే పరిమితికి మించిన అప్పులు చేసి.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఆరోపించారు. లోపభూయిష్టమైన విధానాలను అనుసరించి.. అభివృద్ధిని కుంటుపడేలా చేసిందన్నారు.
బడ్జెట్ హైలైట్స్
- ఏపీ వార్షిక బడ్జెట్ రూ.2,94,427.25 కోట్లు
- రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34 లక్షల కోట్లు
- ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు
- GSDPలో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం
- మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లు
- రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు
- ఉన్నత విద్యకు రూ.2,326 కోట్లు
- ఆరోగ్య రంగానికి రూ.18,421 కోట్లు
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.16,739 కోట్లు
- జలవనరులకు రూ.16,705 కోట్లు
- పట్టణాభివృద్ధికి రూ.11,490 కోట్లు
- గృహ నిర్మాణానికి రూ.4012 కోట్లు
- 2024-25 ఆర్థిక సంవత్సరానికి పోలీస్ శాఖకు రూ.8495 కోట్లు
- అటవీ శాఖకు రూ.687 కోట్లు
- 180 కిలోమీటర్ల పొడవున అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం
- స్టేట్ హైవేల కోసం రూ.600 కోట్లు
- యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖలకు రూ.322 కోట్లు
- ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాకు 3 శాతం రిజర్వేషన్
- ఎస్టీ సంక్షేమానికి రూ.7,557 కోట్లు
- బీసీ సంక్షేమానికి రూ.39,007 కోట్లు
- వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.11,855 కోట్లు
- అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమానికి రూ.4,376 కోట్లు
- మహిళా శిశు సంక్షేమానికి రూ.4,285 కోట్లు
- స్కిల్ డెవలప్ మెంట్ కు రూ.1215 కోట్లు
- వైద్యారోగ్య శాఖకు రూ.18,421 కోట్లు