Venu Swamy:బాలీవుడ్‌లోకి వేణుస్వామి ఎంట్రీ.. అక్కడి హీరోయిన్లకు జాతకాలు షురూ!

ప్రముఖ జ్యోతిష్యుడు(famous astrologer) వేణుస్వామి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ సంచలనం సృష్టిస్తారు.

Update: 2025-01-02 15:09 GMT

దిశ,వెబ్‌డెస్క్: ప్రముఖ జ్యోతిష్యుడు(famous astrologer) వేణుస్వామి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ సంచలనం సృష్టిస్తారు. ఈ క్రమంలో కొన్ని సార్లు వివాదాలకు దారి తీసిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వేణుస్వామి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అదేమిటంటే.. టాలీవుడ్‌తో నాకేంటి బాలీవుడ్(Bollywood) ఉండగా అన్నట్లు.. హిందీలో జాతకాలు షురూ చేయడానికి వేణు స్వామి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా వేణుస్వామి ఇన్‌స్టాలో ఓ వీడియోని పోస్ట్ చేశారు. ఆ వీడియోలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ వామిక గబ్బి(Vamika Gabbi) జాతకాన్ని వేణు స్వామి చెప్పినట్లు తెలుస్తోంది.

వామికా జాతకం విశ్లేషించిన వేణుస్వామి..

‘‘వామికాది రోహిణి నక్షత్రం, వృషభ రాశి. 2025 ఫిబ్రవరి 10 నుంచి ఆమెకు గురు మహర్దశ మొదలు కాబోతుంది. ప్రస్తుతం రాహు మహర్దశ నడుస్తుంది. అయితే భవిష్యత్తులో వామికాకి ఇంకా క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. పెద్ద హీరోయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉండడంతో పాటు.. పెద్ద డైరెక్టర్లు, పెద్ద స్టార్ల పక్కన ఆమె నటించే అవకాశం ఉంది. అలానే ఫిబ్రవరి 10 నుంచి ఆమెకు రాజయోగం పట్టబోతుంది. 16 ఏళ్ల పాటు సినిమాల్లో ఆమెకు తిరుగుండదు. ఫైనాల్లి ఆమె స్టార్ హీరోయిన్ అవ్వబోతుంది’’ అంటూ వేణు స్వామి(Venu Swamy) పేర్కొన్నారు.

Tags:    

Similar News