నా జీవితాన్ని మార్చింది ఇద్దరే ఇద్దరు.. ఎస్‌జే సూర్య కామెంట్స్ వైరల్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’. స్టార్ డైరెక్టర్ శంక‌ర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం

Update: 2025-01-04 17:17 GMT

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’. స్టార్ డైరెక్టర్ శంక‌ర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఇక ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన అప్‌డేట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. భారీ అంచనాలు ఉన్న ఈ మూవీ తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో జ‌న‌వ‌రి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా రాజమండ్రిలో ప్రీరిలీజ్ ఫంక్షన్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్‌జే సూర్య మాట్లాడుతూ.. ‘నా లైఫ్‌లో ఇద్దరు నా ఆలోచన విధానాన్ని మార్చేశారు. ఒకటి ఏఆర్. రెహమాన్.. మరొకరు పవన్ కల్యాణ్. ఈ సినిమాలో రామ్ చరణ్ చాలా బాగా యాక్ట్ చేశారు. ఇందులో ఆయనవి రెండు క్యారెక్టర్లు. ఒకదాంట్లో పవన్ కల్యాణ్ ఫీల్డ్‌లో ఏం చేస్తున్నారో.. రామ్ చరణ్ ఆన్ స్క్రీన్‌లో చేస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ.. ‘పవన్ కల్యాణ్ గారు పవర్ కోసమో.. పదవి కోసమో కాదు.. మీ కోసం బతుకుతున్నారు’ అని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News