రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్‌’కు BIG షాక్.. విడుదలను అడ్డుకోవాలని నిర్మాతల సంఘానికి విజ్ఞప్తి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’(Game Changer) చిత్రానికి చివరి నిమిషంలో అనూహ్య షాక్ తగిలింది.

Update: 2025-01-06 14:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’(Game Changer) చిత్రానికి చివరి నిమిషంలో అనూహ్య షాక్ తగిలింది. మూడ్రోజుల్లో సినిమా విడుదల ఉండగా లైకా ప్రొడక్షన్(Lyca Productions) షాకిచ్చింది. తమిళనాడులో ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్‌ను ఆపాలంటూ తమిళ నిర్మాతల మండలిని లైకా ప్రొడక్షన్స్ కోరింది. డైరెక్టర్ శంకర్(Director Shankar).. ఇండియన్-3(Indian-3 Movie) షూటింగ్‌ను కంప్లీట్ చేసి రిలీజ్ చేసేవరకూ ‘గేమ్ ఛేంజర్‌’ను విడుదల చేయకూడదంటూ లైకా డిమాండ్ చేస్తోంది. ఈ వివాదంపై తమిళ నిర్మాతల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? అనే విషయం ఆసక్తికరంగా మారింది. అయితే.. లైకా ప్రొడక్షన్స్ అడ్డుపడుతున్న విషయం సోషల్ మీడియాలో వైరల్ కావాడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ లైకా ప్రొడక్షన్స్‌‌పై ఫైర్ అవుతున్నారు.

‘గేమ్ ఛేంజర్’ హిట్ అయితే ఇండియన్-3కి కూడా క్రేజ్ వస్తుందని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు.. గత ఏడాది రిలీజ్ అయిన ‘ఇండియన్ 2’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా మిగిలింది. ఈ నేపథ్యంలోనే ‘ఇండియన్ 2’ మూవీని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్‌కు భారీ నష్టాలు వచ్చాయి. అయితే ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే డైరెక్టర్ శంకర్ పార్ట్-3ని కూడా పూర్తి చేశారని సమచారం. ఒక్క పాట షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని.. దానిని పక్కనపడేసి రామ్ చరణ్‌ సినిమాను విడుదలకు సిద్ధం చేయడంపై లైకా ప్రొడక్షన్‌ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘గేమ్ ఛేంజర్’ విడుదలకు ఇంకా మూడ్రోజులే ఉండటంతో సమస్యలు త్వరగా సాల్వ్ అవ్వాలని ఫ్యాన్స్‌ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Full View


Read More...

Game Changer: నా కెరీర్‌లో ఇదే బెస్ట్ సినిమా అవుతుంది.. హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్





Tags:    

Similar News