lavanya: నెటిజన్లను ఆకట్టుకుంటోన్న మెగా కోడలి లేటెస్ట్ ఫొటో షూట్
అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నటి లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi).
దిశ, వెబ్‌డెస్క్: అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నటి లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi). తర్వాత ఈ లొట్ట చెంపల బ్యూటీ దూసుకెళ్తా, బ్రమ్మన్, మనం, 10:30, చాలియన్ స్కూల్, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా(Soggade Chinninayana), లచ్చిందేవికీ ఓలెక్కుంది, శ్రీరస్తు శుభమస్తు(Srirastu Shubhamastu), మిస్టర్, రాధయుద్ధం శరణం, ఉన్నది ఒకటే జిందగీ, మాయవన్, ఇంటిలిజెంట్(Intelligent), అంతరిక్షం, అర్జున్ సురవరం(Arjun Suravaram), ఏ 1 ఎక్స్‌ప్రెస్, చావు కబురు చల్లగా, హ్యాపీ బర్త్‌డే(Happy Birthday), పులి మేక, మిస్ పర్ఫెక్ట్ వంటి తెలుగు, హిందీ, తమిళం సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో తనదైన సత్తా చాటి.. ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది లావణ్య త్రిపాఠి.
ఈ హీరోయిన్ సినిమాల్లో నటించే సమయంలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ప్రేమలో పడి.. పెద్దల సమక్షంలో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. వివాహనంతరం కూడా వీరు సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఇకపోతే తాజాగా నటి లావణ్య త్రిపాఠి అదిరిపోయే ఫొటో షూట్ చేసింది. పీచ్ కలర్ శారీ కట్టుకుని.. చెవులకు పెద్ద జుంకాలు పెట్టుకుని.. సింపుల్ ఫొటో షూట్ చేసింది. అంతేకాకుండా ఈ పిక్స్ కు ‘పీచ్ అండ్ ఫ్లీజ్’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం లావణ్య లేటెస్ట్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.